ONGC: బీటెక్‌, డిగ్రీ విద్యార్థులకు బంపరాఫర్‌.. నెలకు రూ1.8 లక్షల జీతంతో ONGC లో 871 ఉద్యోగాలు

ONGC Recruitment 2022: ఈ నోటిఫికేషన్‌ ద్వారా 871 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది.
గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) గేట్ స్కోర్-2022 ద్వారా ఈ-1 స్థాయిలో ఇంజినీరింగ్, జియో- సైన్సెస్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 871 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు: 871

ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్: 13 పోస్టులు
ఏఈ (సిమెంటింగ్)- పెట్రోలియం: 04 పోస్టులు
ఏఈఈ (సివిల్): 29 పోస్టులు
ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్: 212 పోస్టులు
ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం: 20 పోస్టులు
ఏఈఈ (ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు
ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 53 పోస్టులు
ఏఈఈ (మెకానికల్): 103 పోస్టులు
ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్: 39 పోస్టులు
ఏఈఈ (ప్రొడక్షన్)- కెమికల్: 60 పోస్టులు
ఏఈఈ (ప్రొడక్షన్)- పెట్రోలియం: 32 పోస్టులు
ఏఈఈ (పర్యావరణ): 11 పోస్టులు
ఏఈఈ (రిజర్వాయర్): 33 పోస్టులు
కెమిస్ట్: 39 పోస్టులు
జియాలజిస్ట్: 55 పోస్టులు
జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్‌): 54 పోస్టులు
జియోఫిజిసిస్ట్ (వెల్స్): 24 పోస్టులు
ప్రోగ్రామింగ్ ఆఫీసర్: 13 పోస్టులు
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్: 32 పోస్టులు
ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌: 13 పోస్టులు

ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2022 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 31.07.2022 నాటికి ఏఈఈ- డ్రిల్లింగ్/ సిమెంటింగ్ పోస్టులకు 28 ఏళ్లు; మిగిలిన ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.60,000 - రూ.180,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2022 స్కోరు, విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 12, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.ongcindia.com/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top