DRDO లో 1901 ఉద్యోగాలు.. ఎంపికైన వారికి రూ.1,12,400 వరకూ జీతం.. ఈ అర్హతలుంటే చాలు

DRDO Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో ఎంట్రన్స్‌ టెస్టుకు సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్‌ 10/ డీఆర్‌టీసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1901 సీనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్‌, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్‌ 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు
మొత్తం ఖాళీలు: 1901 పోస్టులు

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌-బి (ఎస్‌టీఏ-బి): 1075 పోస్టులు

విభాగాలు: ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎంఎల్‌టీ, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్‌టైల్, జువాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.టెక్నీషియన్- ఏ: 826 పోస్టులు

ముఖ్య సమాచారం:

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఎస్‌టీఏ పోస్టులకు రూ.35,400- రూ.1,12,400, టెక్నీషియన్ పోస్టులకు రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ) స్క్రీనింగ్ టెస్ట్, టైర్-2(సీబీటీ) ఎంపిక పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 03, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 23, 2022


పూర్తివివరాలకు వెబ్‌సైట్‌:https://www.drdo.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top