దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
పరీక్షను నిర్వహంచిన ఐఐటీ బాంబే ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటించనుంది. దీంతోపాటు మెరిట్ లిస్ట్‌ను కూడా విడుదల చేయనుంది. పరీక్ష రాసిన విద్యార్థులు www.jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా మెరిట్ జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యకు రెండున్నర రెట్ల మంది ఉత్తీర్ణులయ్యేలా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు.
గత నెల 28న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 1.56 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి అంటే సెప్టెంబర్ 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దీనిద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు కేటాయించనున్నారు.
0 comments:
Post a Comment