ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 396 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 14గా పేర్కొన్నారు. అర్హత, పోస్టుల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన(Contract Basis) నియమించనున్నారు. ముంబైలో(Mumbai) పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Amazon Freedom Sale Live: వీటిపై భారీగా తగ్గింపులు.. ఎస్బీఐ కార్డు, ఈఎంఐలతో అదనపు డిస్కౌంట్స్..
సంస్థ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ (RCF)
ఉద్యోగం పేరు: గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటీస్
పోస్టుల సంఖ్య: 396
అర్హతలు: ఇంటర్, డిగ్రీ చేసి ఉండాలి. మరి కొన్ని పోస్టులకు డిగ్రీతో పాటు.. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. అర్హతల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఉద్యోగ స్థలం: రాయ్‌ఘడ్ - ముంబై
స్టైపెండ్: ప్రతి నెలా రూ.5,000-9,000.
వయోపరిమితి: నేషనల్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి గరిష్ట వయస్సు 25 ఏళ్లకు మించకూడదు.
వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులు 03 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు , PwD అభ్యర్థులు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు సమర్పణ: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు : లేదు
ఎంపిక ప్రక్రియ:
మెరిట్ జాబితా, డాక్యుమెంట్ పరిశీలన ఆధారంగా
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 30 జూలై 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 14 ఆగస్టు 2022
నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లు
అధికారిక నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్: rcfltd.com
దరఖాస్తు ఇలా..
-నోటిఫికేషన్ 2022ని క్షుణ్ణంగా చదివి.. అర్హత ప్రమాణాలకు ఉంటే.. దరఖాస్తు చేసుకోవచ్చు.
-ముందుగా www.rcfltd.com లింక్‌పై క్లిక్ చేసి.. అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారమ్‌లో ఇచ్చిన వివరాలను పూరించాలి.
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment