పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఆఫీసర్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్( Notification ) విడుదల చేసింది.మొత్తం 103 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 30. ఆసక్తిగల అభ్యర్థులు PNB అధికారిక వెబ్‌సైట్ pnbindia.inలో పూర్తి వివరాలను చెక్ చేసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హత, పోస్టుల వివరాలు, జీతం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
అర్హతలు..
బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
మేనేజర్ (సెక్యూరిటీ) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు మూడు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేస్తామని బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని ఉల్లఘింస్తే.. రూ. 3 లక్షలు చెల్లించాలి. ఆఫీసర్ (ఫైర్-సేఫ్టీ) పోస్టుకు, బాండ్ వ్యవధి మేనేజర్‌తో సమానంగా ఉంటుంది. అయితే ఆఫీసర్ పోస్ట్‌కు బాండ్ మొత్తం రూ. 2 లక్షలుగా నిర్ణయించారు.
ఖాళీ వివరాలు
ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఫైర్-సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు 23 ఖాళీలు ఉన్నాయి.
సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు 80 ఖాళీలు ఉన్నాయి. 103 ఖాళీలలో మొత్తం 15 షెడ్యూల్ కులాలకు, 27 ఇతర వెనుకబడిన తరగతులకు, ఏడు షెడ్యూల్ తెగలకు, పది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, 44 జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వు చేయబడ్డాయి.
వయస్సు..
అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకురూ. 1,003 మరియు SC, ST, PwBD అభ్యర్థులకు రూ. 59చెల్లించాలి.
జీతం..
ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు పే స్కేల్ రూ.36,000, సెక్యూరిటీ మేనేజర్ పోస్టుకు పే స్కేల్ రూ.48,170.
దరఖాస్తు ఇలా..
Step 1: pnbindia.in అనే అధికారిక సైట్‌ని సందర్శించండి.
Step 2: 'రిక్రూట్‌మెంట్' ట్యాబ్‌కి వెళ్లండి.
Step 3: ప్రాధాన్య పోస్ట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
Step 4: అవసరమైన వివరాలతో ఫారమ్‌ను పూరించండి.
Step 5: ఫారమ్‌తో అవసరమైన పత్రాలను జోడించి, ఈ చిరునామాకు పంపండి - చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం), Hrd డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం 4, సెక్టార్ 10, ద్వారక, న్యూఢిల్లీ -110075. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30-08-2022ని నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ
వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి.. రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను చేపడతారు. మొదటి విధానంలో దరఖాస్తును సమర్పించేటప్పుడు అభ్యర్థులు అందించిన పత్రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయడం ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
రెండవ విధానంలో ఆన్‌లైన్ లేదా రాత పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ చేసే వారు నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 50 ప్రశ్నలను కలిగి ఉంటుంది మరియు ఒక గంట వ్యవధి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పిన పరీక్ష 100 మార్కులకు, ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
0 comments:
Post a Comment