ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh Government) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కృష్ణా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. వైద్య విధాన పరిషత్, డీహెచ్ కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Krishna District Government Hospital) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టులను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 296 మెడికల్ స్టాఫ్ పోస్టులను(Medical Staff Jobs) భర్తీ చేయనున్నారు.
అర్హతలు
పోస్టును బట్టి.. పదో తరగతి అర్హతతో పాటు.. సంబంధిత స్పెషలైజేషన్ లో ఐటీఐ, ఇంటర్ డిప్లమా చేసి ఉండాలి. మరి కొన్ని పోస్టులకు బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.
వయో పరిమితి
అభ్యర్థులు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
దరఖాస్తు విధానం
దరఖాస్తులను పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఆగస్టు 20, 2022 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట, నాయర్ బడ్డీ సెంటర్ దగ్గర, మచిలీపట్నం కృష్ణా, ఏపీ అడ్రస్ కు పోస్టు చేయాలి. దరఖాస్తు ఫీజు రూ. 250లుగా పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్ ఛాలెంజెడ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
వీరిని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
జీతం
పోస్టును బట్టి నెలకు రూ. 15,000 నుంచి రూ. 61,960 లు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క స్క్రుటినీ ఆగస్టు 25లోపు చేస్తారు. ఆగస్టు 26న మెరిట్ లిస్ట్ ను వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఆగస్టు 27, 28న ఫిర్యాదు చేయవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ను ఆగస్టు 29న వెల్లడించనున్నారు. అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ను ఆగస్టు 31న జారీ చేయనున్నారు.
0 comments:
Post a Comment