FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు FCI అధికారిక వెబ్‌సైట్ fci.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంట.. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు https://fci.gov.in/.. ఈ లింక్ ద్వారా FCI మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF, మీరు అధికారిక నోటిఫికేషన్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం 113 పోస్టులను భర్తీ చేయున్నారు. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజులాంటి తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 27 ఆగస్టు 2022ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 26 సెప్టెంబర్ 2022పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 26 సెప్టెంబర్ 2022
ఖాళీ వివరాలు..మొత్తం పోస్టుల సంఖ్య – 113
మేనేజర్ జనరల్-19
మేనేజర్ డిపో-15
మేనేజర్ Movement-06
మేనేజర్ Accounts-35
మేనేజర్ టెక్నికల్-28
మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్-06
మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్-01
మేనేజర్ హిందీ-03
అర్హత ప్రమాణాలు..మేనేజర్(General, Depot, Movement) పోస్టులకు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమానం లేదా CA/ICWA/CS కలిగి ఉండాలి. SC/ST/ PwBD అభ్యర్థుల విషయంలో కనీస మార్కుల శాతం 60% కి బదులుగా 55% ఉండాలి.
మేనేజర్ (అకౌంట్స్)..బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ బీకామ్ మరియు MBA(ఫిన్) డిగ్రీ/ కనిష్ట 2 సంవత్సరాల డిప్లొమా లేదా CA/CS కలిగి ఉండాలి.
వయోపరిమితి..మేనేజర్ హిందీ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలుఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
0 comments:
Post a Comment