Police Jobs 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీస్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఢిల్లీలోని పోలీస్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఈ నియామకాలను చేపడుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ GD ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 10 నుండి SI పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. SSC సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించడం ద్వారా చేయాలి.
0 comments:
Post a Comment