ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నిరుద్యోగులకు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) శుభవార్త చెప్పింది
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు మంచి కొలువు అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఖాళీల భర్తీ దిశగా.... ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. చిత్తూరు జిల్లాలో 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10 తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన యువత వరకు అర్హులు ప్లేస్మెంట్స్ ప్రోగ్రాం ద్వారా ప్రముఖ కంపెనీ అయినా ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో డెలివరీ అసోసియేట్ ఉద్యోగాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
ఆగస్టు 6న అంటే ఈ శనివారం తిరుపతిలోని ఇన్స్ట కార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Instakart Services Pvt Ltd), ధనలక్ష్మి నగర్, అవిలాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. టెన్త్ /ఇంటర్/డిప్లొమా/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు స్మార్ట్ మొబైల్ ఫోన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ మరియు బైక్ సదుపాయం కలిగిన యువకులకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఈ డ్రైవ్ లో మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు స్మార్ట్ ఫోన్, బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.*
విద్యార్హతలు: పదవ తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగానికి కేవలం పురుషులు మాత్రమే అర్హులు
జీతం: రూ.20,000 -40,000/- తో పాటు యాక్సిడెంటల్, మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు
వయోపరిమితి : 18 -45 సంవత్సరాలు.
ఇతర వివరాలకు ఈ క్రింద ఇవ్వబడిన రిజిస్ట్రేషన్ లింకు లో తప్పనిసరిగా నమోదు చేసుకోవలసి ఉంటుంది. https://apssdc.in/industryplacements/ ఓపెన్ చేసి రిజిస్ట్రేషనే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 04-08-2022. ఆసక్తి కలిగిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినడిగా జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారులు తెలియజేశారు. మరిన్ని వివరాలకు +919966601867 ను సంప్రదించగలరు.
0 comments:
Post a Comment