National Thermal Power Corporation Limited: ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే
NTPC Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్‌ఈ) విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవలప్‌మెంట్, హైడ్రోజన్, కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ పీవీ లేఔట్, విండ్, సబ్ స్టేషన్ డిజైన్, సిస్టమ్ ఇంజినీరింగ్, స్విచ్‌యార్డ్, స్ట్రక్చర్స్, ఫౌండేషన్, సివిల్ పీవీ లైఔట్, హ్యూమన్ రిసోర్సెస్, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్స్ సర్వీసెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. జులై 29 దరఖాస్తులకు చివరితేది
మొత్తం ఖాళీల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, బిజినెస్ డెవలప్‌మెంట్, హైడ్రోజన్, కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎస్టిమేషన్, ఎలక్ట్రికల్ పీవీ లేఔట్, విండ్, సబ్ స్టేషన్ డిజైన్, సిస్టమ్ ఇంజినీరింగ్, స్విచ్‌యార్డ్, స్ట్రక్చర్స్, ఫౌండేషన్, సివిల్ పీవీ లైఔట్, హ్యూమన్ రిసోర్సెస్, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్స్ సర్వీసెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విద్యార్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి ఇతర పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 15, 2022
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.ntpc.co.in/
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Notification
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment