ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి ఉద్యోగాల (Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ (Flipkart Job Registration) చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 3న ఉదయం 10 గంటలకు వైజాగ్ లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....
https://chat.whatsapp.com/Gt8tILi6WHOAsXGBuLgyb8
0 comments:
Post a Comment