IBPS Clerk Recruitment 2022 | ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
1. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రతీ ఏటా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. IBPS CRP CLERKS-XII నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 పోస్టుల్ని భర్తీ చేస్తోంది2. తెలంగాణలో 99, ఆంధ్రప్రదేశ్‌లో 209 పోస్టులున్నాయి. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూలై 21 లోగా దరఖాస్తు చేయాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
3. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2022 జూలై 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు ఉండాలి. 1994 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.4. ఈ పోస్టులకు దరఖాస్తు విధానం చూస్తే అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో CRP Clerical పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Common Recruitment Process for Clerical Cadre XII పైన క్లిక్ చేయాలి. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ లింక్ ఉంటుంది. అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి
5. కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి. మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి6. నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. అభ్యర్థులు జూలై 21 లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 2022 జూలై 1 నుంచి 2022 జూలై 21 వరకు ఫీజు చెల్లించవచ్చు
Join the WhatsApp group below for different types of job notifications
0 comments:
Post a Comment