ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వరుసగా జాబ్ మేళా (Job Mela) లు నిర్వహిస్తూ వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది APSSDC. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటనను అధికారులు విడుదల చేశారుప్రముఖ ఐటీ కంపెనీ Tech Mahindra సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా సంస్థలో 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ ప్రాసెస్-కన్నడ, కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ - Tamil విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Customer Service - Kannada: ఈ విభాగంలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు కన్నడ భాషను మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
Customer Service Process: ఈ విభాగంలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
0 comments:
Post a Comment