ఆంధ్రప్రదేశ్ లో పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. Foxlink India Electronic Pvt Ltd, Vihan Electronics Pvt Ltd సంస్థల్లో ఖాళీల (Jobs) భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో వరుసగా 300, 20 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. ఆపరటేర్స్, EV Service Technician విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాను ఈ నెల 11న అంటే రేపు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
\1\6Foxlink India Electronic Pvt Ltd: ఈ సంస్థలో 300 ఖాళీలు ఉన్నాయి. ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16,279 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు రేణిగుంట (తిరుపతి ఎయిర్టోర్ట్ పక్కన) లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18-24 ఏళ్లు ఉండాలి. కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Vihan Electronics Pvt Ltd: ఈ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. EV Service Technician విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ITI మెకానికల్ లేదా ఎలక్ట్రికల్/డిప్లొమా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు వైజాగ్ సత్యం జంక్షన్/గాజువాక/పీఎం స్టేడియం/పెందుర్తిలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
https://chat.whatsapp.com/F61l8QDY9A9GY9UkMfrE1U
0 comments:
Post a Comment