ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధిచి అధికారులు ప్రకటన విడుదల చేశారు.ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 13న సోమవారం ఉదయం 10 గంటలకు నరసాపురంలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు (Job Interviews) హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Tech Team Solutions: ఈ సంస్థలో ఎంబేడెడ్ ఇంజనీర్/ప్రాజెక్ట్ డెవలపర్ విభాగంలో 15 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీటెక్, ఈసీఈ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏలూరు/తాడేపల్లిగూడెం/భీమవరం లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 22-26 ఏళ్లు ఉండాలి.
Byjus: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.3 లక్షల వేతనం ఉంటుంది. రెండు నెలల ట్రైనింగ్ అనంతరం ఏడాదికి రూ.10 లక్షల వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రాజమండ్రి లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి.
YSRCP Job Mela: ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 15 వేల మందికి జాబ్స్.. రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే
Hetero Drugs: ఈ సంస్థలో 400 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.1.06 లక్షల నుంచి రూ.2.06 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నక్కపల్లిలో పని చేయాల్సి ఉంటుంది.
Innosource: బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిగ్యూటీవ్స్ & మేనేజర్స్ విభాగంలో 25 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ చేసిన అబ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు తాడేపల్లిగూడెం/ఏలూరులో పని చేయాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment