ప్రభుత్వం కొత్త ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసింది.తాజాగా మరో సంస్థలో నోటిఫికేషన్ను విడుదల చేసింది.ఆ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రదాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్రేడ్స్‌మెన్ బీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఉద్యోగాలు, జీతం మొదలగు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీల సంఖ్య: 21
ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు: 11
ఫిట్టర్ పోస్టులు: 12
ఎలక్ట్రీషియన్ పోస్టులు: 3
మెషినిస్ట్ పోస్టులు: 10
టర్నర్ పోస్టులు: 4
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28కు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25, 2022.
Join WhatsApp Group:
Official Website: Click Here
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment