ప్రస్తుతం చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ..ఉద్యోగాలు తెచ్చుకుంటున్న వారి సంఖ్య తక్కువ. కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు.ప్రభుత్వ సంస్థల్లో ఖాలీలు ఉన్న పోస్టులకు భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించారు.ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో కూడా వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు.తాజాగా మర9 ప్రైవేట్ కంపెనీ విప్రో బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో గ్రాడ్యుయేట్‌లను నియమించుకుంటోంది. ఈ ప్రొగ్రాం ద్వారా 2021, 2022 ఇంజనీరింగ్ పాసైన విద్యార్థులంతా అర్హులేనని పేర్కొంది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి 3.5 లక్షల వేతనం చెల్లించనున్నారు.అలాగే ఒక ఏడాది అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి మే 2 వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.చివరి తేదీ మే 22 , 2022 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు..
2021,22 లో బీటెక్ ను పూర్తీ చేసి ఉండాలి.
పదిలో, ఇంటర్‌లో 60శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ వచ్చి ఉండాలి.
ఎంపిక సమయానికి ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగ్ ఉన్నా ఆఫర్ లెటర్ ఇస్తారు.
ముడేళ్ల కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు.
ఆరునెలల వ్యవధిలో ఎటువంటి విప్రో పరీక్షలు రాసి ఉండకూడదు.
రిజిస్ట్రేషన్ విధానం..
ముందుగా విప్రో అధికారిక వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేయాలి.
తర్వాత రిజిస్టర్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
కొత్త వెబ్ పేజీలో Elite National Talent Hunt అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి Apply Know ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్‌ను తప్పులు లేకుండా పూర్తీ చేసి సబ్మిట్ నొక్కాలి.
పరీక్ష విధానం..
ఈ ఆన్ లైన్ ఎగ్జామ్ లో అసెస్‌మెంట్ పరీక్షలో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 128 నిమిషాలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇందులో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించి కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.
0 comments:
Post a Comment