175 కిపైగా కంపెనీల భాగస్వామ్యం
ఇప్పటి వరకు 90వేల మంది రిజిస్ట్రేషన్
25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్యర్యంలో ఏపీలో ఇటీవల భారీ జాబ్ మేళాలు (Job Mela) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సంబంధించి నిర్వహకులు ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే మే 7, 8 తేదీల్లో గుంటూరులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero, Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big Basket, Byjus, Cerium Cogent, Dixon తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఇలా..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పార్లమెంట్ నియోజకవర్గం, విద్యార్హత, ఫుల్ అడ్రస్ ను నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.అయితే ఈ జాబ్ మేళాకు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట, నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు చెందిన నిరుద్యోగులు మాత్రమే హాజరుకావాల్సి ఉంది.వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ లో చేరండి
భారీ స్పందన
ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి 90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాబ్‌మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్ అడ్రస్‌కు రెజ్యూమ్ పంపవచ్చు.
కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్‌యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు.
విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం:
నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
0 comments:
Post a Comment