SSC Non-Gazetted Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ladakh) లడఖ్‌లోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
మొత్తం పోస్టులు: 797
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్/ఎలక్షన్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్/జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్-II, ఆర్డర్లీ, సఫాయివాలా, బేరర్ తదితర పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13, 2022.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 2022.
Job Notifications WhatsApp Group: https://chat.whatsapp.com/CAo6bYR0DVUDDYthzJEZjm
వెబ్సైటు : http://www.ssc.nic.in
Notification: Click Here
0 comments:
Post a Comment