తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది.మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది.
పోస్టుల వివరాలు:
ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027,
ఎస్.ఐ పోస్టులు 587 ఉన్నాయి.
సివిల్ కానిస్టేబుళ్లు- 4,965
ఏఆర్ కానిస్టేబుళ్లు- 4,423
టీఎస్ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేళ్లు- 5,010
స్పెషల్ పోలీస్ ఫోర్స్-390,
ఫైర్-610,
డ్రైవర్స్- 100
0 comments:
Post a Comment