డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే (South Western Railway) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఖాళీలు విద్యార్హతల వివరాలు: గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ 147 ఖాళీల్లో 84 అన్ రిజర్వ్డ్ కాగా, ఎస్సీలకు 21, ఎస్టీలకు 10, ఓబీసీలకు 32 కేటాయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్మతలను కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 42, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్టీ, ఎస్సీలకు 47 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
అప్లికేషన్ ఫీజు: ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎలా అప్లై చేయాలి..
Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://www.rrchubli.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం నోటిఫికేషన్ లింక్ పక్కన Click here to submit online application ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: మొదటగా పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేయాలి. అనంతరం Start Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top