Krishna Dt | కృష్ణాజిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కృష్ణాజిల్లా లోని వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వు చేయబడిన వివిధ ఉద్యోగాల నియామకపు ప్రకటన 2022, ఈ క్రింది ప్రకటించిన ఖాళీలు అన్నియు పూర్తిగా కృష్ణాజిల్లా స్థానికత కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడును.

1₁ 2, వికలాంగుల బ్యాక్ గ్ గ్రూప్-IV, క్లాస్-IV మరియు టెక్నికల్ ఉద్యోగాలు పరిమిత నియామకపు కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ఈ ప్రకటన వెలువడిన తేది నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరు కార్యాలయపు ఆవరణ, మచిలీపట్నం, కృష్ణాజిల్లాలో దాఖలు చేయవలెను. అభ్యర్థి కనీస వయస్సు తేది: 01-07-2022 నాటికి 18 సం॥లు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 52 సం॥లు దాటి

3.GO.Ms.No.31 Women Development Child Welfare (DW) Department, తేది: 01-12-2009 తదుపరి వచ్చిన GO.Ms.No.2 Dept. for Women, Children, Differently Abled & Sr. Citizens (Prog.II), తేది: 19-02-2020
ప్రకారం జిల్లా మెడికల్ బోర్డు/సదరం క్యాంపులో జారీ చేయబడిన (శాశ్వత దృవీకరణ పత్రము) కనీసం 40% వైకల్యముతో ధృవీకరణపత్రం దరఖాస్తుతో పాటు జతపరచాలి. బధిరులకు పై ఉత్తర్వుల మేరకు ఉద్యోగ రిజర్వేషన్కు సూచించిన కనీస అంగవైకల్య అర్హత కలిగి ఉండాలి.

4. ప్రభుత్వము నియమించిన రాష్ట్ర స్థాయి అప్పిలేటు ట్రిబ్యునలు / మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన అంగవైకల్య శాతమునే పరిగణలోనికి తీసుకొని నియామకం చేయబడును. అప్పిలేటు ట్రిబ్యునలు / మెడికల్ బోర్డు వారు ధృవీకరించు అంగవైకల్య శాతము పరిక్ష కొరకు హాజరుకాని అభ్యర్ధులను అనర్హులుగా పరిగణించి వారి తదుపరి వారికి అవకాశము కల్పించబడును. 
5. అభ్యర్ధులు తాము దరఖాస్తుతోపాటు విద్యార్హతలు/పుట్టిన తేది/టెక్నికల్/ఇతర అర్హతలు తెలుపు ధృవపత్రముల ప్రతులను మరియు
ఎంప్లాయిమెంట్ కార్డు జిరాక్స్ పూర్తిగా వివరములు కనిపించేలా ప్రతిని తప్పక జతపరచాలి. దరఖాస్తులో దరఖాస్తు దారుని ఫోన్ నెంబర్ తప్పక సూచించవలెను. 
6. ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No. 52 LET Dept. dt. 19.04.2012 ప్రకారము ఉద్యోగ ప్రకటన తేదీనాటికి అభ్యర్థులు తమ"పేరును జిల్లా ఉపాధి కార్యాలయము నందు నమోదు చేసుకొని ఉండవలెను. నమోదు చేసుకోని వారు ధరఖాస్తు చేసిన ఎడల వారికి ఎంప్లాయిమెంటు సీనియారిటి మార్కులు కేటాయించబడవు. 
7. దరఖాస్తుతో పాటు ఇటీవలి రెండు పాస్పోర్టు సైజు ఫోటోగ్రాఫను జతపరచాలి. ఫోటోగ్రాఫ్ పైన ముందు భాగంలో ఇంకుతో అభ్యర్థి సంతకం చేయాలి. ఒకటి దరఖాస్తుకు అతికించాలి. మరొకటి పిన్ చేయాలి. అభ్యర్థులు 4 నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలల నుండి స్టడీ సర్టిఫికేట్ తీసుకుని జతచేయాలి. ఒకవేళ పాఠశాలలో 8.-9. చదవని పక్షంలో ఆ ఏడు సంవత్సరాల కాలానికి సంబంధించి తత్సంబంద తహసిల్దారుచే పొందిన దృవీకరణ పత్రము నిర్ణీత దరఖాస్తులో (ఎనర్ ఎ) జతచేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ జతచేయని పక్షంలో ధరఖాస్తును తిరస్కరించబడును.

ప్రకటనలో పేర్కొనిన ఉద్యోగములకు సూచించిన విద్యార్హతలకు సంబంధించిన ఉత్తీర్ణత మార్కుల జాబితాను (మెమో) తప్పక జతపరచవలెను. అలా జత చేయని పక్షములో దరఖాస్తును తిరస్కరించబడును. 
10. ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగులైన అభ్యర్థులు ఈ ప్రకటననుసరించి దరఖాస్తు చేసుకొనదలిచినచో వారి పై అధికారి యొక్క అనుమతి పత్రముతో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. లేని యెడల దరఖాస్తు తిరస్కరించబడును.

11. ఏ కేటాగిరికి కేటాయించిన పోస్టులకు ఆ కేటాగిరికి చెందిన అంగవైకల్యము కల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయవలెను. ఉదా.. అంధులకు కేటాయించిన పోస్టులను అంధులు మాత్రమే దరఖాస్తు చేయవలెను. ఇతర అంగవైకల్యము కలవారు దరఖాస్తు చేయరాదు. చేసిన యెడల దరఖాస్తు తిరస్కరించబడును. పైన పేర్కొన్న ధృవపత్రాలు జతచేయని యెడల దరఖాస్తులు తిరస్కరించబడును.

12. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి ప్రతి ఉద్యోగమునకు విడివిడిగా దరఖాస్తు చేయవలసి ఉంటుంది. లేనిచో అభ్యర్థి మొదట సూచించిన
ఉద్యోగమునకు మాత్రమే అట్టి దరఖాస్తును పరిశీలించబడుతుంది. 
13. పూర్తిచేసిన దరఖాస్తులు సీల్డ్ కవర్లో ఉంచి ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో కవర్పై స్పష్టంగా వ్రాసి జిల్లా కలెక్టర్, కృష్ణాజిల్లా గారి పేరున రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా నేరుగా గాని నిర్ణీత తేదీలోగా సమర్పించవలెను. నిర్ణీత తేదీ తర్వాత చేసిన దరఖాస్తులు స్వీకరించబడవు.

14. అర్హత లేని మరియు అసంపూర్తి ధరఖాస్తులు తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు.

15. అంధులు మరియు బధిరులు వారికొరకై నడుపబడుచున్న ప్రత్యేక పాఠశాలలో చదివినట్లైతే వారియొక్క తల్లిదండ్రుల నివాస ప్రాంతాన్ని వారి స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. అందుకు సంభందించి తల్లి చంద్రుల నివాస ధృవీకరణ పత్రము అందజేయవలెను. 
16. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువ ఇవ్వబడినవి సందర్భాన్ని బట్టి ఈ ప్రకటనలోని ఉద్యోగాల సంఖ్య పెరగవచ్చు లేక తగ్గవచ్చు లేదా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టరు వారికి కలదు..

17. జతచేయవలసిన పత్రములు తప్పనిసరిగా దరఖాస్తుతోపాటు జతచేయవలెను. జతచేయవలసిన పత్రములు దరఖాస్తు చేసిన పిమ్మట పంపినట్లయితే వాటిని పరిగణలోనికి తీసుకొనబడవు.
ఉద్యోగ నియామక విధానం: 
అభ్యర్థుల వయస్సు, అంగవైకల్యం మరియు ఎంప్లాయిమెంటు సీనియారిటీకి మార్కులు కేటాయిస్తు మెరిట్ నిర్ణయించబడును మరియు నియామకం పూర్తిగా మెరిట్ ప్రకారము జరుగును. పూర్తి ప్రకటన, నిబంధనలు క్షుణంగా చదివి, జతచేయు పత్రములు, నమూనా ధరఖాస్తు ఫారముకి జతచేసి పూర్తి చేసిన ధరఖాస్తు ఫారమును ప్రకటన వెలువడిన తేది నుండి 15 పనిదినములోగా లోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరు కార్యాలయము ఆవరణ, మచిలీపట్నం కృష్ణాజిల్లా వారి కార్యాలయమునకు సమర్పించవలెయును, నమూనా దరఖాస్తు ఫారము, ప్రకటన పూర్తి వివరములు జతచేయు పత్రములు మరియు (ఎనెగెర్-ఎ)కొరకు https//krishna.ap.gov.in ని దర్శించి వివరములు పొందగలరు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/Gt8tILi6WHOAsXGBuLgyb8

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top