మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

Jobs: మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంక్‌ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మార్చి 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.
మొత్తం 200 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://www.apmaheshbank.com/ వెబ్ సైట్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 23,934 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

https://www.apmaheshbank.com/sites/all/themes/maheshbank/files/clerical%20recruitment-2022.pdf లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top