APSSDC Job Mela: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు

APSSDC Job Mela: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తోందిఇందులో భాగంగా ఈ నెల 24న కాకినాడలో జాబ్ మేళా నిర్వహించనుంది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఖజానాలో ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తారు. ఖాళీలు, విద్యార్హత, రిజిస్ట్రేషన్ తదితర వివరాలు ఈ కింద తెలుసుకోండి.

ఖాళీల వివరాలు :

ఖజానా జువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ - 20, క్యాషియర్ - 04 పోస్టులను జాబ్ మేళాలో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యార్హత :

అభ్యర్థులు ఇంటర్/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

రిజిస్ట్రేషన్ :

జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ జరిగే వేదిక :

కాకినాడలోని ఖజానా జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, 34-1-13, టెంపుల్ స్ట్రీట్ వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 7396799788 నంబర్‌లో సంప్రదించాలి.
Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top