న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 8

*ఇందులో అసిస్టెంట్ మేనేజర్ 20, ఎగ్జిక్యూటివ్ 20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు కనీసం 75 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

*ఎగ్జిక్యూటివ్(సివిల్‌) ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 33 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ircon.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top