ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటనలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.తాజాగా మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ PATRA INDIA BPO Solutions Pvt Ltdలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను ఈ నెల 3న ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో నిర్వహించనుండగా.. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. మూడేళ్ల డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.45 లక్షల వేతనం చెల్లించనున్నారు
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 3న ఉదయం 9 గంటలకు Samata Degree College in MNP Colony, Visakhapatnam Dt. చిరునామాలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7989330319 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
-ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి...
https://chat.whatsapp.com/CgJUTKK2qoDDyg97Nc5Zr0
టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.....
0 comments:
Post a Comment