దిగ్గజ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ (TCS Off Campus Digital Hiring) కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.ఇప్పటికే పలు ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది టీసీఎస్. ఇప్పుడు తాజాగా క్యాంపస్ డిజిటల్ హైరింగ్ ప్రాసెస్ ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 ఫిబ్రవరి 25 లోగా అప్లై చేయాలి. ఇప్పటికే టీసీఎస్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన అభ్యర్థులు అప్పుడు జారీ చేసిన CT/DT ఐడీతో తాజా ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కనీసం 6 నుంచి 12 నెలల ఐటీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ నిర్వహిస్తున్న డిజిటల్ హైరింగ్ వివరాలు తెలుసుకోండి.
TCS Off Campus Digital Hiring: టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ వివరాలివే...
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 25
పరీక్ష తేదీ- త్వరలోనే వెల్లడించనున్న టీసీఎస్
ఇంటర్వ్యూ తేదీ- పరీక్ష తర్వాత వెల్లడించనున్న టీసీఎస్
విద్యార్హతలు- బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలి. 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాస్ అయినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
అనుభవం- ఐటీ కంపెనీలో కనీసం 6 నెలల నుంచి 12 నెలలు
ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్
వేతనం- అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఏడాదికి రూ.7,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఏడాదికి రూ.7,30,000.
TCS Off Campus Digital Hiring: దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థులు TCS NextStep portal ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Register Now పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 6- అప్లికేషన్ స్టేటస్‌లో Application Received అని ఉండాలి.
Step 7- ఆ తర్వాత CT/DT ఐడీతో రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 8- https://www.tcs.com/careers/tcs-digital-hiring వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apple Here with CT/DT ID పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే సదరు అభ్యర్థిని అనర్హులుగా పరిగణిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా రెండు దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ సమయంలో అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్స్‌తో పాటు ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. టెస్టుకు సంబంధిచిన సమాచారాన్ని TCS iON అందిస్తుంది.
0 comments:
Post a Comment