టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(టీసీఎస్-ఎన్‌క్యూటీ) రాసేందుకు ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో యూజీ/పీజీ/డిప్లొమా అర్హతలున్న అభ్యర్థులు అర్హులు.ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల ఫైనల్ ఇయర్, ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షకు రెండురోజుల ముందు పరీక్ష తేదీ, సమయానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారు.
ఎంపిక విధానం
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంట్రీ లెవెల్ జాబ్స్‌కు అవసరమయ్యే నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.
రెండేళ్ల వ్యాలిడిటీ
టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.
పరీక్ష విధానం
ఎన్‌క్యూటీ పరీక్షలో మొత్తం 92ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 180 నిమిషాలు ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ 24 ప్రశ్నలు-30 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-50 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీ 26 ప్రశ్నలు-40 నిమిషాలు, ప్రోగ్రామింగ్ లాజిక్ 10 ప్రశ్నలు-15 నిమిషాలు, కోడింగ్‌కు 2 ప్రశ్నలకుగాను 45 నిమిషాల పరీక్ష సమయాన్ని కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 25.03.2022
ఎన్‌క్యూటీ పరీక్ష తేదీ: 10.04.2022
0 comments:
Post a Comment