విశాఖపట్నంలోని నిరుద్యోగులకు శుభవార్త. పాత్రా ఇండియా బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 200 ఉద్యోగాలు ఉన్నాయి.ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఫిబ్రవరి 18న జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాకు (Job Mela) రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఎంపికైనవారికి విశాఖపట్నంలో పోస్టింగ్ లభిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు ఫిబ్రవరి 18న జాబ్ మేళాకు హాజరు కావాలి. డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. పాత్రా ఇండియా బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే జాబ్ మేళా వివరాలు తెలుసుకోండి.
APSSDC Job Mela: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
భర్తీ చేసే పోస్టు- ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్
మొత్తం ఖాళీలు- 200
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 17
జాబ్ మేళా జరిగే తేదీ- 2022 ఫిబ్రవరి 18 ఉదయం 9 గంటల నుంచి
విద్యార్హతలు- మూడేళ్ల డిప్లొమా, డిగ్రీ, పీజీ
అనుభవం- ఐదేళ్ల లోపు
వయస్సు- 18 నుంచి 40 ఏళ్లు
వేతనం- ఏటా రూ.1,45,500
ఎంపిక విధానం- హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, సీనియర్ మేనేజర్ రౌంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
జాబ్ లొకేషన్- విశాఖపట్నం
ఇంటర్వ్యూ జరిగే వేదిక- సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ వుమెన్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం, విశాఖపట్నం.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి... https://chat.whatsapp.com/EkgDkXcksWBHUGYkGPgI1W
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment