Navodaya Vidyalaya Samiti, henceforth mentioned as NVS, under the Ministry of Education has its Hqrs Office at NOIDA (Uttar Pradesh), Hyderabad, Jaipur, Lucknow, Patna, Pune & ShillongNOIDA, Puri, Rangareddy, Udaipur)(JNVs) functional all over India except in the State of Tamil fully residential schools up to Senior Secondary level and are located mainly in rural areas.NVS invites online applications from Indian citizens for recruitment following posts:
అర్హతల వివరాలు:
అసిస్టెంట్ కమిషనర్: ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ హ్యుమానిటీస్/సైన్స్/కామర్స్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్(అడ్మిన్) : ఈ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి.
మహిళా స్టాఫ్ నర్స్: ఈ విభాగంలో 82 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 35 ఏళ్లలోపు ఉండాలి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: ఈ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
ఆడిట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 11 ఖాళీలు ఉన్నాయి. బీకామ్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: ఈ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీర్(సివిల్): ఈ విభాగంలో ఒక ఖాళీ ఉది. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
స్టెనో గ్రాఫర్ (గ్రూప్ సీ): ఈ విభాగంలో 22 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్: డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని 4 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
క్యాటరింగ్ అసిస్టెంట్: ఈ విభాగంలో 87 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ తో పాటు కేటరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లు ఉండాలి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: ఈ విభాగంలో 630 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. టైప్ రైటింగ్ లో నాలెడ్జ్ ఉండాలి.
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: ఈ విభాగంలో 273 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఎలక్ట్రీషియన్/ప్లంబింగ్/వైర్ మ్యాన్ విభాగంలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసకోవచ్చు. వయస్సు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్: ఈ విభాగంలో 142 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ తో పాటు ల్యాబరేటరి టెక్నిక్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
మెస్ హెల్పర్: ఈ విభాగంలో మొత్తం 629 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఎలా అప్లై చేయాలంటే:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్,యకరీంనగర్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
వివివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment