ఏపీలో ఈ రోజే మెగా జాబ్ డ్రైవ్.. KIA, Tech Mahindra, Relianceతో పాటు 30 సంస్థల్లో 3500 జాబ్స్..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో భారీ జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
కియా మోటార్స్ (KIA Motors), ISUZU మోటార్స్, Tech Mahindra, Indigo Airlines, Deccan Chemicals, Amararaja batteries, SBI Credit Cards, Hero Motocorp, Hetero Drugs, Reliance Retail, Dmart, Meesho, Just Dail, HDFCతో కలిపి మొత్తం 30 సంస్థల్లో 3,550లకు పైగా ఖాళీలను భర్తీకి ఈ నెల 22న జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
KIA Motors: ఈ సంస్థలో NEEM Trainee విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు.
Tech Mahindra: ఈ సంస్థలో అసోసియేట్, సీనియర్ అసోసియేట్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
Indigo Airlines: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. లోడర్స్, డ్రైవర్స్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్(పాస్ పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/LMV తప్పనిసరి) పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
AmaraRaja Batteries: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Reliance Retail: కస్టమర్ సేల్స్ అసోసియేట్ విభాగంలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Meesho: ఈ సంస్థలో టెన్త్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ 100 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
HDFC: ఈ బ్యాంకులో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Jobs in Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలు.. అర్హతలు ఇవే!
Just Dial: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Deccan Chemicals: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ కెమిస్ట్/QA/QC విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీటెక్/డిప్లొమా కెమికల్/బీఎస్సీ కెమిస్ట్రీ/బయో టెక్నాలజీ & ఎంఎస్సీ కెమస్ట్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వేతనం చెల్లించనున్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top