బీటెక్ పాసైన వారికి ఉద్యోగాలు నెలకు లక్ష రూపాయల జీతం

సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.బీటెక్ పాసై అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం 14 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2, కెమికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. 2022 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీనాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వేతనంగా లభించనుంది.

2020, 2021 సంవత్సరాలలో వాలిడ్ గేట్ స్కోర్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. అకడమిక్ మెరిట్, గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

https://cpri.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top