దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ పోస్టలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ను విస్తృతం చేయడంలో భాగంగా 58 పోస్టుల భర్తీ చేపట్టింది. ఇందులో ఎన్‌ఆర్‌ఐ వెల్త్ ప్రోడక్ట్ మేనేజర్ ప్రోడక్ట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని ఐదేండ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నారు. అభ్యర్థులు పనితీరునుబట్టి పదవీకాలాన్ని పొడిగిస్తారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 58
ఇందులో ఎన్‌ఆర్‌ఐ వెల్త్ ప్రోడక్ట్ మేనేజర్ 1, ప్రోడక్ట్ మేనేజర్ 31, ఇన్వెస్ట్‌మెంట్ రిసెర్చ్ మేనేజర్ 4, గ్రూప్ సేల్స్ హెడ్ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 27
వెబ్‌సైట్: www.bankofbarodacoin/careers.htm
 
 
   Subscribe My Whatsapp & Telegram Groups
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment