ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల రాష్ట్రంలో వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ మరో జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది.
తాజాగా టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థలో 300 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఖాళీలు, అర్హతల వివరాలు..
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ - బ్యాంకింగ్: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.80 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
TCS Jobs 2022: ఆ కోర్సు పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్-(Tamil): ఈ విభాగంలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా తమిల్ మాట్లాడగలగాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.80 లక్షల వేతనం తో పాటు 2 వేల బ్రేక్ షిఫ్ట్ అలవెన్స్, 1000 ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
కస్టమర్ సర్వీస్ ప్రాసెస్-(కన్నడ): ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ మాట్లాడగలగాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.64 లక్షల వేతనం చెల్లించనున్నారు. ఇంకా 2 వేల బ్రేక్ అలవెన్స్ ఉంటుంది. ఇంకా రూ. 1000 ఇన్సెంటీవ్స్ చెల్లిస్తారు.
ఇతర వివరాలు:
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ https://apssdc.in/industryplacements/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-అనంతరం ఈ నెల 8వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-Vijetha Degree College, Officers Lane, Near RTC Buss stand, Chittor చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
Job Notifications వాట్సాప్ గ్రూప్ నందు చేరండి:https://chat.whatsapp.com/FmDU6gt2oEE1enYZ8VCVqf
Job Notifications Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment