Krishna Dt | అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయాల నియామకానికి నోటిఫికేషన్
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ కె. ఉమారాణి మంగళ వారం ఓ ప్రకటనలో తెలిపారు. అవ నిగడ్డ, మచిలీపట్నం, పెడన, బంటు మిల్లి, చిల్లకల్లు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, కంచికచర్ల, కంకిపాడు, మండవల్లి, మొవ్వ, మైలవరం, నంది గామ, నూజివీడు, పామర్రు, తిరు వూరు, విజయవాడ-1, 2, విస్సన్నపేట, ఉయ్యూరు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు. 23 కార్యకర్తల ఉద్యోగాల ఖాళీలు ఉండగా, వీటిలో ఎస్సీలకు 7, బీసీలకు 4, ఓసీ లకు 12 ఉన్నట్టు వివరించారు. ఆయాలు 216 ఖాళీగా ఉండగా, వీటిలో ఎస్సీలకు 70, బీసీలకు 77, ఓసీలకు 63 ఉన్నట్టు తెలిపారు. అర్హు లైన వారు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించారు. కార్యకర్త ఉద్యోగాలకు 21 నుంచి 35 ఏళ్ల వయసు, పదో తరగతి విద్యార్హత కలిగి, ఆ ఊరి కోడలై ఉండాలన్నారు. వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాయాల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.
0 comments:
Post a Comment