దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందిఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 6 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో డాటా సైంటిస్ట్, డాటా ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Bank of Baroda: ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తం ఖాళీలు: 15
అర్హతలు: డాటా సైంటిస్ట్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈలలో ఏదో ఒకటి చేసి ఉండాలి. డాటా ఇంజినీర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఐటీలో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. అభ్యర్థులు 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 6
వెబ్‌సైట్: www.bankofbaroda.in
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
Biggest govt bank in India but they full fill only 15 jobs. very sad . There are millions of people are unemployees in India I suggest to you please think once
ReplyDelete