ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ అమర రాజా(AMARA RAJA) సంస్థలో ఖాళీల (Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది
మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ (Jobs Registration) చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20న తంబళ్లపల్లెలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు Apprenticeship విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
ఖాళీలు విద్యార్హతల వివరాలు:
1. టెన్త్(పాస్/ఫెయిల్)/ఇంటర్ ఫెయిల్ అభ్యర్థులకు 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ. 7500, తర్వాత 9 నెలలు రూ. 10,446 మరియు తర్వాత 12 నెలలు రూ. 10, 646 వేతనం చెల్లించనున్నారు.
2. ఇంటర్ పాసైన వారి కోసం 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి మూడు నెలల పాటు రూ. 7500, తర్వాత 9 నెలలు రూ.10, 646 వేతనం చెల్లించనున్నారు. తర్వాత 12 నెలల పాటు నెలకు రూ. 10, 846 వేతనం చెల్లించనున్నారు.
వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
ఇతర వివరాలు: HR రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరులోని అమర రాజా గ్రూప్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రాయితీపై భోజన, వసతి సదుపాయం ఉంటుంది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలు విడుదల చేసే నోటిఫికేషన్లు కావలసినవారు టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment