ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఈ నెల 30న నెల్లూరులో జాబ్ మేళా(Job Mela) నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటన విడుదల చేసింది.
పాల్గొనే కంపెనీలు:
డీ-మార్ట్ D-Mart, ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ (Khazana Jewellery Pvt. Ltd)లో పలు ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: మొత్తం 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Interviews) నిర్వహించునున్నారు.
విద్యార్హత: టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు (Jobs) అప్లై చేసేందుకు అర్హులు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
D-Mart:
ఈ సంస్థలో మొత్తం 90 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాషియర్, గోడౌన్ అసిస్టెంట్స్, పార్ట్ టైమ్ జాబ్-క్యాషియర్స్, సేల్స్ అసోసియేట్స్, ప్యాకర్స్, పార్ట్ టైమ్ జాబ్-సేట్స్ అసోసియేట్/ప్యాకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ. 5 వేల నుంచి రూ. 10,626 వరకు చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18-25 ఏళ్ల వయస్సు ఉండాలి.Khazana Jewellery Pvt.Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్/క్యాషియర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.రిజిస్ట్రేషన్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
-అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో తెలిపారు.
-ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
-ఇతర పూర్తి వివరాలకు 7780289591, 8639867407 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
Kandulasiddu089@gmail.com
ReplyDelete28 November 2021 at 7:55
ReplyDeleteKandulasiddu089@gmail.com