NCL Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్‌సీఎల్) వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు 8, 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 9 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://nclcil.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1500
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)- 100
ఫిట్టర్- 800
ఎలక్ట్రీషియన్- 500
మోటార్ మెకానిక్- 100
అర్హత: 8, 10 ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
వయసు: 2021 జూన్ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 09, 2021
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి
వెబ్‌సైట్:http://nclcil.in/
0 comments:
Post a Comment