ఏపీ ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10వేల 32 హెల్త్ క్లినిక్స్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్) నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే 2వేల 920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్యమిషన్ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ప్రాతిపదికన మిగతా నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారు.
దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి.ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ గత రెండేళ్లుగా 9వేల 500కిపైగా శాశ్వత నియామకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉండేలా నియామకాలు పూర్తి చేశారు. వేలాది మంది స్టాఫ్ నర్సులను నియమించారు.
గత ఏడాది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం ఇలా...
జిల్లా సంఖ్య
శ్రీకాకుళం 173
విజయనగరం 187
విశాఖపట్నం 247
తూ.గోదావరి 274
ప.గోదావరి 248
కష్ణా 237
గుంటూరు 284
ప్రకాశం 204
నెల్లూరు 166
చిత్తూరు 268
కడప 172
అనంతపురం 241
కర్నూలు 219
ప్రతి క్లినిక్‌లో సిబ్బంది, మందులు:
ఈ ఏడాది చివరి నాటికి 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎఎన్‌ఎం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి క్లినిక్‌లో మందులు అందుబాబులో ఉంటాయి. ప్రాథమిక వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతామని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి Click Here to Join Whatsapp Group
Local depression treatment centers offer therapy, medication, and support to help manage symptoms and improve mental health. Depression Treatment Centers Near Me
ReplyDelete