ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది. సంస్థ నుంచి అనేక నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టెన్త్ నుంచి పీజీ వరకు అన్ని విద్యార్హతలు కలిగిన వారి కోసం సంస్థ నుంచి ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం విశేషం. చిన్న చిన్న కంపెనీల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీని సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అనేక సార్లు నిరుద్యోగులకు వివిధ అంశాలపై కంపెనీలకు కావాల్సిన శిక్షణను ఉచితంగా అందించి సైతం ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైందిప్రముఖ టెలికాం సంస్థ Airtelలో ఖాళీల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 4G Champ Executive విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా దరఖాస్తుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి Click Here to Join Whatsapp Group
0 comments:
Post a Comment