తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పి.వి. నరసింహారావు పశుసంవర్థక విశ్వవిద్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య: 127
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
మొత్తం ఖాళీల సంఖ్య: 112
యూనివర్సిటీల వారీగా ఖాళీలు
పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ-10 ఖాళీలు (జనరల్-4, బిసి-ఎ-1, బిసి-బి-1, బిసి-సి-0, బిసి-డి-0, బీసీ-ఇ-0, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ-102 ఖాళీలు (జనరల్-41, బిసి-ఎ-8, బిసి-బి-10, బిసి-సి-1, బిసి-డి-7, బీసీ-ఇ-4, ఎస్సీ-16, ఎస్టీ-6, పీహెచ్‌సీ-5, ఎక్స్ సర్వీస్‌మెన్-2)
పోస్టు పేరు: సీనియర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీల సంఖ్య:15 (జనరల్-8, బిసి-ఎ-1, బిసి-బి-1, బిసి-సి-1, బిసి-డి-0, బీసీ-ఇ-0, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1)
కేవలం పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మాత్రమే ఖాళీలు ఉన్నాయి.
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ & కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత లేదా బిసిఎ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్ ఆప్షనల్/ ఎలిక్టివ్ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత, గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు: జూలై 1,2021 నాటికి 18 నుంచి 34ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ మరియు బీసీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (టిఎస్‌ఆర్‌టిసి, కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు మొదలైన ఉద్యోగులు వయస్సు సడలింపునకు అర్హులు కాదు) ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్/ ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌కు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు రూ. 16,400-49,870, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.22,460-66,330
ఫీజు: ప్రతి దరఖాస్తుదారుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200. ఇది కాకుండా, దరఖాస్తుదారులు పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి.
గమనిక:ఎస్సీ/ ఎస్టీ & పీహెచ్‌సీలకు మరియు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ దరఖాస్తుదారులు (వారు నిరుద్యోగులు అని తగిన సమయంలో డిక్లరేషన్‌ను కమిషన్‌కు సమర్పించాలి)
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్(HMDA అధికార పరిధితో సహా), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్‌తో సహా మొత్తం 10 కేంద్రాల్లో/ సెంటర్లలో రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్)ను కమిషన్ నిర్వహిస్తుంది.
ఎంపిక:కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సిబిఆర్‌టి) లేదా ఆఫ్‌లైన్ ఓఎంఆర్ ఆధారిత(ఆబ్జెక్టివ్) పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్(పేపర్1)-150 మార్కులు (150 ప్రశ్నలు), సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ – డిప్లొమా స్టాండర్డ్ -150 మార్కులు (150 ప్రశ్నలు)
ప్రతి పేపర్‌కు (పేపర్ 1 మరియు పేపర్ 2 ) కేటాయించిన సమయం 150 నిమిషాలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటిఆర్)లో నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన గమనిక:అభ్యర్థులు తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసేటప్పుడు, అవసరమైతే OTRలను అప్‌డేట్ చేసేటప్పుడు కింది పత్రాల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి
1. ఆధార్ నంబర్
2. విద్యార్హత వివరాలు అంటే ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ మొదలైనవి. వాటి రోల్ నంబర్లు, ఉత్తీర్ణత సంవత్సరం, ఫలితాల ప్రకటన తేదీ.
3. మీ సేవా / ఈ- సేవా నుంచి పొందిన కమ్యూనిటీ/ కుల ధ్రువీకరణ పత్రం అంటే ఒటిఆర్‌లో అప్‌లోడ్ చేయడానికి నమోదు సంఖ్య, ఇష్యూ చేసిన తేదీ.
4. నోటిఫికేషన్ ప్రకారం సాంకేతిక అర్హత ధ్రువీకరణ పత్రాలు.
5. స్పోర్ట్స్ రిజర్వేషన్, పిహెచ్, మాజీ సైనికుల కోటాను క్లెయిమ్ చేసే సర్టిఫికెట్లు.
దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 12 నుంచి
చివరితేదీ: మే 5 వరకు
వెబ్‌సైట్:www.tspsc.gov.in
పై అన్ని పోస్టులు రాష్ట్ర క్యాడర్‌కు సంబంధించినవని గుర్తించాలి.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/BODW87zd4EjGZ1DvzRPLhb
0 comments:
Post a Comment