స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 148 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 148 (స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు):
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
పరీక్ష తేది: మే 23, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్ హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 13, 2021
• దరఖాస్తులకు చివరితేది: మే 3, 2021
• వెబ్ సైట్: https://www.sbi.co.in/
0 comments:
Post a Comment