సచివాలయ ఉద్యోగాలు

★ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన 21,69,719 మందికి వచ్చే నెల 1 నుంచి ఆరు రోజులపాటు రాత పరీక్షలు నిర్వహణ.

★ వివిధ కేటగిరిల్లో ఉద్యోగాలకు అత్యధికంగా వచ్చిన దరఖాస్తుదారులకు 1, 3 తేదీల్లో,

★ మిగతా వారందరికీ తదుపరి రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులు వెల్లడి.

★ ఒకటో తేదీన కేటగిరి-1లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 15.50 లక్షల మందికి పరీక్ష నిర్వహణ.

★ 13 జిల్లాల్లోని అన్ని తాలూకా, మండల కేంద్రాల్లో కలిపి ఉదయం 12.54 లక్షలు, రెండో పూట 2.96 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు.

★ గ్రామ ఇంజినీరింగ్‌ కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన 1,33,800 మందికి, గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పోస్టులకు అర్జీలు పెట్టిన మరో 1.55 లక్షల మందికి 3, 4 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

★ మిగతా కేటగిరిల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారందరికీ రోజుకు లక్ష మందికి చొప్పున 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తారు.

★ 1న తాలూకా, మండల కేంద్రాల్లో, మిగతా తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top