Yantra India Jobs 2023: యంత్ర ఇండియాలో 5,395 ఉద్యోగాలు.. నో ఎగ్జాం.. నో ఇంటర్వ్యూ.. టెన్స్ పాసైతే చాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి..5,395 ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోని ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్‌ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. 
మొత్తం ఖాళీలు:
మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత:

పదో తరగతితోపాటు, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి పోస్టులకు పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 28.03.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ : నెలకు నాన్-ఐటీఐలకు ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు. రూ.6000;

ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : రూ.200(ఎస్సీ,ST, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.100).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.02.2023. 

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28.03.2023.


వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top