Government Jobs : ప్రభుత్వ సంస్థలో గ్రూప్- సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు

Government Jobs : కేంద్ర పర్యావరణ మంత్విత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 72 గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 72
టెక్నీషియన్ (ఫీల్డ్/ ల్యాబ్ రిసెర్చ్) - 23
టెక్నీషియన్(మెయింటెనెన్స్)- 06
టెక్నికల్ అసిస్టెంట్(పారా మెడికల్)- 07
లోయర్ డివిజన్ క్లర్క్- 05
ఫారెస్ట్ గార్డ్- 02
స్టెనో గ్రేడ్ 2- 01
స్టోర్ కీపర్- 02
డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్- 04
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 22

ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.700).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19, 2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (స్టేజ్-1): ఫిబ్రవరి, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://fri.icfre.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top