TS Job Mela | తెలంగాణలో ఉద్యోగమేళా

తెలంగాణ (Telangana) లో ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (TS Job Notifications) రిలీజ్ అవుతున్నాయి. నిరుద్యోగులకు సర్కారీ కొలువులు దక్కేలా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోంది. పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తోంది. వీటితో పాటు.. ఆయా జిల్లాలోని ఉపాధి కల్పనా కార్యాలయాల్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పొల్గొంటూ.. ఉద్యోగాలు సాధిస్తున్నారు.దీనిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను పొందేందుకు డిసెంబర్ 22, 2022 ఉదయం 11గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనా అధికారి పి. సాహితి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూ అనేది యాదాద్రి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, రూమ్ నంబర్ ఎఫ్ 8, మొదటి అంతస్థు, జిల్లా సమీకృత కార్యాలయాల సమూహం, న్యూ కలెక్టరేట్ నందు నిర్వహించనున్నారు. మొత్తం 200 ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ పోస్టులు హైదరాబాద్ లోని అపోలో ఫార్మసీ సంస్థలో పని చేసేందుకు నియమించనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఇలా.. 1. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు: మొత్తం ఈ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పురుషులు, స్త్రీలు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. జీతం నెలకు రూ.12,600 నుంచి రూ.20,000 చెల్లిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీ. ఫార్మసీ లేదా బీ. ఫార్మసీ లేదా ఎం. ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి.ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు: ట్రైనీ ఫార్మసిస్ట్ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. జీతం నెలకు రూ.11,600 నుంచి రూ.18,000 చెల్లిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీ. ఫార్మసీ లేదా బీ. ఫార్మసీ లేదా ఎం. ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. 3. ఫార్మసీ అసిస్టెంట్ : ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు 50 ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. జీతం నెలకు రూ.11,000 నుంచి రూ.16,000 చెల్లిస్తారు. దీనికి ఎస్సెస్సీ లేదా ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 4. రీటైల్ ట్రైనీ అసోసియేట్ : రీటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్టులు 50 ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. జీతం నెలకు రూ.10,600 చెల్లిస్తారు. దీనికి ఎస్సెస్సీ లేదా ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు.. విద్యార్హతల సర్టిఫికేట్స్ జిరాక్స్ పత్రాలతో యాదాద్రి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, రూమ్ నంబర్ ఎఫ్ 8, మొదటి అంతస్థు, జిల్లా సమీకృత కార్యాలయాల సమూహం, న్యూ కలెక్టరేట్ నందు డిసెంబర్ 22, 2022 న ఉదయం 11 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూ హాజరు కావాలని ప్రకటన ద్వారా తెలియజేశారు.

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

Telegram Group:https://t.me/apjobs9
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top