మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏవేం పోస్టులు ఉన్నాయి? వాటికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత ఇస్తారు? ఈ పోస్టుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు మీ కోసం.

మొత్తం పోస్టులు: 295

జూనియర్ ఓవర్ మ్యాన్: 82 (యుఆర్ 43 + ఈడబ్ల్యూఎస్ 08 + ఎస్సీ 14 + ఎస్టీ 07 + ఓబీసీ 10)
మైనింగ్ సర్దార్: 145 (యుఆర్ 74 + ఈడబ్ల్యూఎస్ 14 + ఎస్సీ 13 + ఎస్టీ 35 + ఓబీసీ 09)
సర్వేయర్: 68 (యుఆర్ 27 + ఈడబ్ల్యూఎస్ 06 + ఎస్సీ 12 + ఎస్టీ 14 + ఓబీసీ 09)
జీతాలు:
జూనియర్ ఓవర్ మ్యాన్: నెలకు రూ. 31,852.56/-
మైనింగ్ సర్దార్: నెలకు రూ. 31,852.56/-
సర్వేయర్: నెలకు రూ. 34,391.65/-
కనీస అర్హతలు:
జూనియర్ ఓవర్ మ్యాన్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు: 
మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 ఏళ్ల డిప్లోమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 
కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం, ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో పని చేసినట్టు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జారీ చేసిన వ్యాలిడ్ ‘ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ’ సర్టిఫికెట్ (అన్-రిస్ట్రిక్టెడ్) ఉండాలి. 
లేదా కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం, మైనింగ్ లో ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఓవర్ మ్యాన్ గా పని చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జారీ చేసిన ఏదైనా సర్టిఫికెట్ ఉండాలి. 
వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ ఉండాలి. 

మైనింగ్ సర్దార్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు:
సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్ (10+2) అర్హత ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
మైనింగ్ ఇంజనీరింగ్ లో 3 ఏళ్ల డిప్లోమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 
కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం, ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో పని చేసినట్టు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జారీ చేసిన వ్యాలిడ్ ‘మైనింగ్ సర్దార్ షిప్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ (అన్-రిస్ట్రిక్టెడ్)’ ఉండాలి.  లేదా కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 ప్రకారం, ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో మైనింగ్ సర్దార్ గా పని చేసినట్టు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జారీ చేసిన ఏదైనా కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. 
వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ ఉండాలి. 
సర్వేయర్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు:
సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్ (10+2) అర్హత ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
లేదా మైనింగ్/మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ లో 3 ఏళ్ల డిప్లోమా లేదా డిగ్రీ ఉండాలి. లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. 
2017 కోల్ మైన్స్ రెగ్యులేషన్ ప్రకారం, ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో పని చేసినట్టు..  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జారీ చేసిన వ్యాలిడ్ సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ (అన్-రిస్ట్రిక్టెడ్) కలిగి ఉండాలి.
వయసు పరిమితి: 23/01/2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. 
వయసు సడలింపు:
ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు: 03 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 05 ఏళ్లు
ఎక్స్ సర్వీస్ మేన్: డిఫెన్స్ సర్వీసెస్ లో సేవలు అందించిన వాస్తవ సేవాకాలం + 3 ఏళ్లు
యుఆర్ కేటగిరీ దివ్యాంగులకు: 10 ఏళ్లు
ఓబీసీ కేటగిరీ దివ్యాంగులకు: 13 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ కేటగిరీ దివ్యాంగులకు: 15 ఏళ్లు
యుఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: వయసు సడలింపు లేదు 
కోల్ ఇండియా లిమిటెడ్ లేదా అనుబంధ సంస్థల్లో పని చేసే వారికి: గరిష్ట వయోపరిమితి లేదు
అభ్యర్థుల ఎంపిక:
అర్హత గల అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ పెడతారు. వచ్చిన ఫలితాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్ జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. 
ఈ టెస్ట్ లో తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. 
జనరల్ అవేర్నెస్, టెక్నికల్ నాలెడ్జ్ మీద టెస్ట్ ఉంటుంది. 
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 100 కి 45 మార్కులు రావాలి. 
ఓబీసీ అభ్యర్థులకి: 100 కి 40 మార్కులు రావాలి. 
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 100 కి 35 మార్కులు రావాలి. 
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు రుసుము: 
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్ఎమ్/కోల్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలో పని చేసే ఉద్యోగులు/మహిళా అభ్యర్థులకు: రూ.0/-
జనరల్ (యుఆర్)/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 1180/-
దరఖాస్తు ప్రారంభ తేదీ: 03/01/2023 ఉదయం 10 గంటలకు
దరఖాస్తు చివరి తేదీ: 23/01/2023 రాత్రి 11.50 వరకూ
 దరఖాస్తు విధానం: 
ఎంసీఎల్ వెబ్ సైట్ లోకి వెళ్లి.. కెరీర్స్ లో రిక్రూట్మెంట్ సెక్షన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. 
అందులో ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు, క్వాలిఫికేషన్ సహా ఇతర వివరాలు పొందుపరచాలి.

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:


Complete Notification:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top