Job Mela: ఏపీలోనినిరుద్యోగులకు మరో శుభవార్త.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్.. నెలకు రూ.25 వేల వరకు వేతనం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈనెల 27న జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 280 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జాబ్ మేళాను బాపట్ల జిల్లాలో నిర్వహించనున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు: Aster Pharmacy: ఈ సంస్థలో 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు విజయవాడ , హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. ఇదే సంస్థలో ట్రైనీ, Pharmacy Aide విభాగంలోనూ 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం ఉంటుంది. ISON Xperience Ltd: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. టెలీకాలర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఎంపికైన వారు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది.

Vidyuth Control Systems Pvt Ltd: ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 19 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, ఇంటర్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు మేడ్చల్ IDAవద్ద పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు TRC Govt ITI College, Gudavalli Post, Cherukupalli Mandal, Bapatla Dist-522259 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 93474 68946, 9505229845, 99888 53335 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top