ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (apssdc) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 27న మరో జాబ్ మేళా ను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ ఇండియా, Blue Ocean Biotech, Matre Human India Resources Pvt Ltd సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలు విద్యార్హతల వివరాలు: డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ&BZC అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనం ఉంటుంది. Blue Ocean Biotech: ఈ సంస్థలో ట్రైనీ కెమిస్ట్రీ, ప్రొడక్షన్ ఆపరేటర్, ట్రైనీ ఫిట్టర్, సూపర్ ప్రాసెస్ విభాగాల్లో 33 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. బీఎస్సీ, టెన్త్, ఇంటర్, ఫిట్టర్, డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుందిMatre Human India Resources Pvt Ltd: ఈ సంస్థలో ఫీల్డ్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 30 ళఏల్లోపు ఉండాలి.
ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 27న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. - ఇంటర్వ్యూలను PR. Govt Degree College (A), Raja Rammohan Roy Road, Near Government General Hospital, Kakinada, Kakinada Dist-533001 చిరునామాలో నిర్వహించనున్నారు. - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010737998, 8247788247 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
0 comments:
Post a Comment